Homeసినిమా వార్తలునీలా నన్నిలా….. రొమాంటిక్ గా సాగుతున్న 7:11 PM మెలోడీ.!!

నీలా నన్నిలా….. రొమాంటిక్ గా సాగుతున్న 7:11 PM మెలోడీ.!!

A Lovely Melody From Sci-Fi Action Thriller 7:11 PM details, 'Neela Nannila' Lyrical video from 7:11 PM movie, 7:11 PM movie shooting update, Saahas, Deepika

Neela Nannila from 7:11 PM Movie: మూవీలో మంచి కంటెంట్ ఉంటే చాలు హీరో కొత్త, పాత లేక చిన్న, పెద్ద అనే విషయం ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. మూవీ అయినా వెబ్ సిరీస్ అయినా అది థియేటర్లో విడుదలైన ఓటీటీ లో విడుదలైన…నచ్చితే చాలు విపరీతంగా ఆదరించి హిట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. మరి అలాంటి సరికొత్త ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో మరో కొత్త టీం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Neela Nannila from 7:11 PM Movie: టైటిల్ దగ్గర నుంచి మూవీ మొత్తం వినూత్నంగా ఉండే విధంగా తెరకెక్కిస్తున్న చిత్రం 7:11 PM. ఈ సినిమాలో సాహస మరియు దీపిక తొలిసారిగా హీరో హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇండస్ట్రీకి కొత్త అయినప్పటికీ యాక్షన్ లో మాత్రం ఇద్దరూ ఆరితేరారని తెలుస్తోంది. ఆర్కస్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతు మాదాల డైరెక్షన్ వహిస్తున్నారు.

అఫ్కోర్స్ టైటిల్ చూడగానే ఇది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ అని అర్థమవుతుంది అనుకోండి. అయితే ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పాటుగా క్రైమ్ గ్రామాన్ని కూడా ఈ స్టోరీలో మిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం నుంచి విడుదలైన మెలోడీ లిరికల్ వీడియో బాగా వైరల్ అయింది. చాలాకాలం తర్వాత మనసును ఆహ్లాదపరిచే మంచి టచ్ ఉన్న మెలోడీ సాంగ్ గా దీన్ని చెప్పవచ్చు.

A Lovely Melody From Sci-Fi Action Thriller 7:11 PM

అనురాగ్ కులకర్ణి ఆలపించిన నీలా నన్నిలా …అని సాగే ఆ మధుర గీతం ఇద్దరు ప్రేమికుల మధ్య ఓ మంచి రొమాంటిక్ ఫీల్ ని ఇవ్వడంతో పాటు మనసుకు ఆహ్లాదంగా కూడా ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రం కాన్సెప్ట్ 1999లో జరిగినట్లుగా చూపిస్తారు. ప్రజెంట్ కి మరియు ఫ్యూచర్ కి మధ్య జరిగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మూవీ స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా హంసలదీవి అనే పట్టణం చుట్టూ ఈ కథ ఆధారపడి ఉంటుంది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్న విషయం రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.

Web Title: A Lovely Melody From Sci-Fi Action Thriller 7:11 PM details, ‘Neela Nannila’ Lyrical video from 7:11 PM movie, 7:11 PM movie shooting update, Saahas, Deepika

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY