అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ గిఫ్ట్‌..!

0
205
A Surprise Gift From Vijay Devarakonda To Allu Arjun
A Surprise Gift From Vijay Devarakonda To Allu Arjun

(A Surprise Gift From Vijay Devarakonda To Allu Arjun) అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం జనవరి 12 న రేపు విడుదల కి సిద్ధంగా వుంది. అయితే ఆ చిత్ర సెలెబ్రేషన్స్ లో రౌడీ బ్రాండ్ దుస్తుల్ని అల్లు అర్జున్ వేసుకోనున్నారు. అయితే అల్లు అర్జున్ చాల సార్లు విజయ్ దేవరకొండ స్టైల్ ఫై, అట్టిట్యూడ్ ఫై కామెంట్లు చేసారు. జయ్ రౌడీ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసి దాంతో కొత్త రకాల దుస్తులని మార్కెట్‌లోకి తెస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ బట్టలు పంపిన ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు.

విజయ్ దేవరకొండ కి కృతజ్ఞతలు చెబుతూ అల్లు అర్జున్ ఇలా అన్నారు. విజయ్ పంపిన దుస్తులు అద్దిరిపోయినట్లుగా ఉన్నాయని, ప్రామిస్ చేసినట్లుగా పంపావు, ఈ దుస్తుల్ని అలా వైకుంఠపురంలో చిత్ర సెలెబ్రేషన్స్ కు గాను వేసుకుంటానని, ఆ సెలెబ్రేషన్స్ లో రౌడీ దుస్తులతో కనిపిస్తానని అన్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఆ వేడుకలు చూసేందుకు ఇప్పటినుండి ఆరాటపడుతున్నారు.ఈ మూవీ జనవరి 12 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక, విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Previous articleAnushka Shetty conveyed her best wishes to Anil Ravipudi
Next articleమిడిల్ క్లాస్ అబ్బాయంటే ఇలా ఉంటాడు : అల్లు అర్జున్