Homeసినిమా వార్తలుప్రభాస్ బర్త్ డే స్పెషల్..ట్రిపుల్ ట్రీట్ రెడీ.!

ప్రభాస్ బర్త్ డే స్పెషల్..ట్రిపుల్ ట్రీట్ రెడీ.!

A triple treat for a darling Prabhas birthday special, Prabhas Birthday special updates, Kalki 2898 AD special poster, Salaar Trailer or Gimplse, Maruti film title announcement, Hanu raghavapudi Movie Announcement, Prabhas Upcoming movie news,

A triple treat for a darling Prabhas birthday special, Prabhas Birthday special updates, Kalki 2898 AD special poster, Salaar Trailer or Gimplse, Maruti film title announcement, Hanu raghavapudi Movie Announcement, Prabhas Upcoming movie news,

ప్రభాస్ డార్లింగ్ బర్త్ డే (Birthday) అంటే ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కూడా పండగే. తను చేయబోయే అలాగే చేస్తున్న సినిమాల గురించి ఆరోజు మూవీ మేకర్స్ అప్డేట్స్ లేదా వీడియోలు విడుదల చేయటం జరుగుతుంది.. ఈసారి కూడా ప్రభాస్ (Prabhas) రాబోయే సినిమాల అప్డేట్స్ బర్తడే సందర్భంగా వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ డార్లింగ్ వయసు 43 సంవత్సరాలు అక్టోబర్ 23 కి 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.

అయితే దీనికి తగిన ఏర్పాట్లు కూడా మూవీ మేకర్స్ చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ప్రభాస్ మోకాలు సర్జరీ నిమిత్తం విదేశాల్లో ఉండగా అక్కడే తన బర్తడే కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మోకాలు సర్జరీ పూర్తి అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ అక్కడే తన బర్త్ డే కూడా జరుపుకునేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రభాస్ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది 22 కల్లా విదేశాల్లో ఉండేటట్టు ఇప్పటికే ప్లాన్ చేసుకోవడం జరిగినట్టు తెలుస్తుంది.

ఇక ప్రభాస్ (Prabhas Movies) సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం తను మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల నుండి ఇంతవరకు ఎటువంటి ప్రచార చిత్రాలు కానీ లేదా వీడియోలు కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేయటం జరగలేదు. అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ బర్తడే (Prabhas Birthday) రోజు ఈ మూడు చిత్రాల నుండి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ అలాగే మారుతి (Maruti) దర్శకత్వంలో చేస్తున్న సినిమా అప్డేట్ అయితే పక్కా ఉంటుంది అంటున్నారు.. అలాగే.. డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమైన సలార్ (Salaar Trailer) మూవీకి సంబంధించి ట్రైలర్ కానీ లేదంటే వీడియో కానీ విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు.. అయితే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అని ఇన్సైడ్ న్యూస్ తెలుస్తుంది. ఇక దీని తర్వాత కల్కి (Kalki) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని జనవరి 13న విడుదలకు సిద్ధం చేసిన షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సమ్మర్ కి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వచ్చిందో లేదో చూడాలి.

మరి ఈసారైనా ప్రభాస్ మూవీ మేకర్స్ ఫ్యాన్స్ ఆశ‌లు తీరుస్తారా? లేదా? అనేది మనకు అక్టోబర్ 22వ తారీకు అంటే ప్రభాస్ బర్తడే ముందు రోజు విషయాలు తెలుస్తాయి. అయితే ప్రస్తుతానికి మూవీ మేకర్స్ నుండి దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY