ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review & Rating: 2.5/5
నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, తదితరులు
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్

మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలన్నీ సెన్సిటివ్ థింగ్స్, ఎమోషన్స్ పైనే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక హీరో సుధీర్ బాబుతో సమ్మోహనం, వి సినిమాల తర్వాత.. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ తెరకెక్కించాడు. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించిన ఈ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి

కథ :
కథ విషయానికి వస్తే, నవీన్( సుధీర్ బాబు) సినీ ఇండస్ట్రీ లో ఓ యంగ్ హిట్ డైరెక్టర్ కాగా తాను సినిమా చెయ్యడానికి ఓ సరైన హీరోయిన్ కోసం చూస్తూ ఉంటాడు. దీనితో ఈ వేటలో ఓ డాక్టర్ అయినటువంటి అలేఖ్య (కృతి శెట్టి) నుంచి ఓ వీడియో చూసి అమితంగా ఇంప్రెస్ అవుతాడు. అక్కడ నుంచి ఆమెని హీరోయిన్ గా పెట్టి తన సినిమా చెయ్యాలని ఫిక్స్ అవుతాడు.

ఈ నేపథ్యంలో అలేఖ్య గురించి, ఆమె ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు నవీన్ కి తెలుస్తాయి. దీంతో ఖచ్చితంగా తను అనుకున్న కథను అలేఖ్యతోనే తీయాలని నిర్ణయించుకుంటాడు. మరి యాక్టింగ్ అంటే ఇష్టం లేదని చెప్పిన అలేఖ్యను నవీన్ సినిమా కోసం ఒప్పించాడా లేదా? అసలు యాక్టింగ్ అంటే అలేఖ్యకు ఎందుకు ఇష్టం లేదు? అలేఖ్య ఫ్యామిలీ గురించి నవీన్ కి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? ఇంతకీ నవీన్ దగ్గరున్న వీడియోలో ఏముంది? చివరికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ నవీన్ ఎలాంటి సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.

Aa Ammayi Gurinchi Meeku Cheppali Review

ప్లస్ లు:

- Advertisement -

కృతిశెట్టి
ఇంటర్వెల్ ట్విస్ట్
డైలాగ్స్
క్లైమాక్స్

మైనస్ లు:

రొటీన్ సీన్స్
ఐటమ్ సాంగ్
ప్రెడక్టబుల్ సెకండాఫ్

సాంకేతిక వర్గం :
సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా చేశారు. ఇక టెక్నికల్ టీం లోకి వస్తే సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సినిమాకి ప్రాణం పోసాడు. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ డీసెంట్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి విషయానికి వస్తే తాను మరో డీసెంట్ సబ్జెక్ట్ తో వచ్చారని చెప్పాలి. పాత్రధారులకి మంచి రోల్స్ డిజైన్ చేసి వారి నుంచి మంచి నటనను కూడా తాను రాబట్టారు. ఈయన సినిమాలకు హీరోలతో పనిలేదు.. అక్కడ దర్శకుడిగా ఇంద్రగంటి పేరు కనిపిస్తే చాలు అనిపిస్తుంటారు. అందుకే స్టార్ హీరోలు లేకుండానే ఇంద్రగంటి సబ్జెక్టు, టేకింగ్ తో ఆకట్టుకుంటారు.

Krithi Shetty Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review
Krithi Shetty Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie Review

విశ్లేషణ:
ఈ సినిమా స్టోరీ లో వివరించిన విధంగానే సుధీర్ బాబు కృతి శెట్టి ని కలిసిన తర్వాత ఆ సినిమాలు ఎలా తెరకెక్కించాడు అనేది మనం చూడొచ్చు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ గా నవీన్ క్యారెక్టర్ లో సుధీర్ బాబు ఇంట్రడక్షన్ తో సినిమా మొదలైంది.

ఇతనికి డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతిశెట్టి పరిచయం అవ్వడం కొత్తగా అనిపిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా హీరో నవీన్, డాక్టర్ అలేఖ్య, సినిమా అనే అంశాల చుట్టూ సాగుతుంది. కానీ.. అనూహ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అదిరిపోయే ట్విస్టు రివీల్ అవుతుంది.

ఇక అలాగే సినిమాలో మెయిన్ పాత్రలో కనిపించే హీరోయిన్ కృతి శెట్టి తన గత చిత్రాలతో పోలిస్తే మంచి పాత్రలో కనిపిస్తుందని చెప్పాలి. మరి దీనిని కూడా ఆమె అంతే పర్ఫెక్ట్ గా తన నటనలో మరింత పరిపక్వతతో నటించింది అని చెప్పాలి.

ఇక సెకండాఫ్ లో ట్విస్టుతో మైండ్ బ్లాక్ అయిన నవీన్.. ఎలాగైనా తను అనుకున్న కథను అలేఖ్యతోనే చెప్పించాలని ప్రయత్నాలు చేయడం.. ఇంతలో ఆమె ఫ్యామిలీ అడ్డురావడం ఇంటరెస్టింగ్ గా అనిపిస్తాయి. మధ్యలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తర్వాత.. సినిమా కోసం అలేఖ్యను ఒప్పుకోవడం కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. కానీ.. హీరోయిన్ కి యాక్టింగ్ ఇష్టం లేకపోయినా.. హీరో ఆమె వెనకే తిరగడం అనేది జనాలకు బుర్రపాడు చేయొచ్చు.

కానీ.. హీరో చివరికి హీరోయిన్ ని ఒప్పించి సినిమా చేయడం.. ఆ విషయం ఫ్యామిలీకి తెలిసి ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించిన విధానం బాగుంది. అలాగే కొన్ని సెన్సిబుల్ ఎమోషన్స్ లో అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ లో సుధీర్ బాబుతో తన కెమిస్ట్రీ బాగుంది. అలాగే సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ అలాగే క్లైమాక్స్ కూడా మెప్పిస్తాయి.

అలాగే మంచి మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళు కూడా ఈ సినిమా నుంచి పెద్దగా ఏమీ ఆశించకుండా ఉంటేనే మంచింది. ఇంకా వీటితో పాటు పలు సన్నివేశాల్లో అయితే అయితే కథనం కాస్త రొటీన్ గానే చాలా సాధారణంగా ఊహించే రేంజ్ లోనే ఉంటుంది. మొత్తానికి ఆ అమ్మాయి గురించి ఇంద్రగంటి చెప్పిన కథ పర్వాలేదు.. బట్ ఓకే అనే ఫీల్ తో బయటికి వస్తారు. ఇదిలా ఉండగా.. ఫిల్మ్ మేకర్ నవీన్ పాత్రకు సుధీర్ బాబు గొప్పగా కాదుగాని.. ఓకే అనిపించాడు.

 

Related Articles

Telugu Articles

Movie Articles