RAPO19: రామ్‌ చిత్రంలో విలన్‌గా ఆది పినిశెట్టి

0
28
Aadhi Pinisetty On Board For Ram Pothineni's RaPo19 Movie

RAPO 19: Adi Pini shetty: రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతి శెట్టి కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టిని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది.

నిర్మాత మాట్లాడుతూ ‘హీరో రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా ఆది పినిశెట్టి పాత్ర శక్తివంతంగా ఉంటుంది. హీరో, విలన్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ పోటాపోటీగా ఉంటాయి. యూనిక్‌ క్యారెక్టరైజేషన్‌తో సాగే పాత్ర కావడంతో విలన్‌గా నటించడానికి ఆది అంగీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ‘‘రామ్‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘సరైనోడు’ తర్వాత మళ్లీ విలన్‌గా చేయాలంటే.. ఆ పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలనుకున్నా. ఈ చిత్ర స్క్రిప్ట్‌ చదివాక.. ఇది మామూలుగా ఉండే పాత్ర కాదనిపించింది. నేనిందులో కర్నూల్‌కు చెందిన ఓ మాస్‌ కుర్రాడిగా కనిపిస్తా.