Aakasam nee haddura Director Sudha Kongara Next Movie With Karthi

సుధా కొంగర. 50 ఏళ్ల ఈ దర్శకురాలు. చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగు వ్యక్తి. సూర్య హీరోగా తెరకెక్కి నవంబర్ 11న అమెజాన్ ప్రైమ్‌ ద్వారా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాల్లో అద్భుతమైన సినిమా ఇదేనంటూ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది. ముఖ్యంగా దర్శకురాలు సుదా కొంగర టేకింగ్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో సుధా కొంగర ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు.

ఇప్పుడు ఆమె ఏ హీరోతో సినిమా చేస్తారన్నడి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకుముందు తెలుగులో వెంకటేష్ తో “గురు” చిత్రాన్ని తీశారు. సుధా కొంగరతో సినిమా చేసేందుకు తమిళ అగ్రహీరో అజిత్ గతంలోనే అంగీకరించారట. అయితే ప్రస్తుతం ఆయన ‘వలిమై’ సినిమాలో షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా అజిత్‌‌తో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఈలోగా సూర్య తమ్ముడు కార్తితో ఓ సినిమా చేసేందుకు సుధా కొంగర ప్లాన్ చేస్తున్నారట.

‘దృశ్యం’తోనే తానేంటో నిరూపించుకున్న సుధా కొంగర ‘ఆకాశమే నీ హద్దురా’తో మరింత క్రేజ్ సాధించుకున్నారనడంతో సందేహమే లేదు. అలాగే, తెలుగులో కూడా ఒక స్ట్రెయిట్ మూవీ కోసం కథ రెడీ చేసుకుంటున్నారు అని టాక్.