ఏ క్యారెక్టర్ చేయాలని అనుకున్నా.. ఈయన తర్వాతే

0
108

ఆమిర్ ఖాన్.. తీసేది సంవత్సరానికి ఒక సినిమానో.. రెండేళ్లకు ఒక్క సినిమానో..! కానీ ఒక క్యారెక్టర్ తనది అనుకున్నాడంటే ఏదైనా చేయడానికి వెనుకాడడు. గజినీ సినిమా కోసం ఎయిట్ ప్యాక్ తో సిద్ధమైనా.. త్రీ ఇడియట్స్ సినిమా కోసం యువకుడిలా తయారవ్వాలన్నా.. దంగల్ సినిమా కోసం ఒళ్ళు విపరీతంగా పెంచి.. ఆ తర్వాత చిన్న సన్నివేశం కోసం కండలు తిరిగిన దేహంతో కనిపించాలన్నా ఆయనకు ఆయనే సాటి. దంగల్ తర్వాత ఆమిర్ నటించిన సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. ఆ సినిమా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి మాత్రం ఆమిర్ తన అభిమానులను అలరించడం పక్కానే..!

ఇప్పుడు ఆమిర్ ఖాన్ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘లాల్ సింగ్ చద్దా’. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా లోని క్యారెక్టర్ కోసమే ఆమిర్ ఖాన్ తన మేకప్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన్ను కనీసం గుర్తు పట్టలేని లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలపాగా, పొడవాటి గడ్డంతో ఉన్న అమీర్‌ని చూసి అభిమానులు షాక్ అయ్యారు.

జైసల్మేర్‌లో అమీర్‌ఖాన్ షూటింగ్ సెట్ నుంచి ఈ ఫోటో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కోల్ కతాలో కూడా ఆమిర్ ఖాన్ షూటింగ్ చేస్తూ కనిపించారు. హౌరా బ్రిడ్జ్ పైన తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో ఆమిర్ ఖాన్ షూటింగ్ చేస్తూ కనిపించారు. మొదట ఆ మేకప్ తో ఉన్న వ్యక్తి ఆమిర్ ఖాన్ అని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. కొద్ది సేపు షూటింగ్ అయ్యాక.. ట్రాఫిక్ పెరగడం, జనాలు ఎక్కువగా తిరగడం మొదలవ్వడం తెలుసుకున్న ఆమిర్ ఖాన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. కొందరు మాత్రమే గుర్తుపట్టి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here