Bigg Boss 7 Telugu Voting Results, Bigg Boss 7 Telugu this week elimination contestant, Aata Sandeep eliminated from 8th week from Bigg Boss house, Bigg Boss 7 Telugu
బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ సీజన్ రసవత్తరంగా జరుగుతుంది. గత సీజన్లకు విభిన్నంగా బిగ్ బాస్ మేకర్స్ ఈ 7 సీజన్ ని డిజైన్ చేయడం జరిగింది. వోల్టా పల్టా అంటూ సాగే ఈ బిగ్ బాస్ లో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేషన్ అవటం జరిగింది.. ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసమని ఇంటి సభ్యుల్లో 8 మంది ఉన్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ కాగా ఈ ఎనిమిదో వారం తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.
బిగ్ బాస్ 7 తెలుగు ఈవారం ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే శోభా అలాగే సందీప్ కి చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిన ఆట సందీప్ ఈవారం హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో లీక్ అయితే జరిగింది. మొదటిగా ఈ వారం నుండి శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు కానీ సందీప్ (aata sandeep) ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి ఏడో వారం వరకు నామినేషన్లలోకి రాకుండా ఆట సందీప్ ఒక రికార్డు సృష్టించాడని చెప్పాలి. బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ ఇన్ని వారాలు ఎలిమినేషన్ లోకి రాకుండా ఉండలేదు. మొత్తానికి 8 వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి సందీప్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం.
బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవటం ప్రతి వారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు సందీప్ ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు 7లో తొలి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరగడంపై ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.