Homeసినిమా వార్తలుదగ్గుబాటి అభిరామ్ అహింస టీజర్: తేజ ఓల్డ్ మార్క్

దగ్గుబాటి అభిరామ్ అహింస టీజర్: తేజ ఓల్డ్ మార్క్

Abhiram Daggubati’s Ahimsa teaser is out: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. రానా తమ్ముడు అభిరామ్ ఇప్పుడు అహింస (Ahimsa) అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకుడు తేజ మళ్లీ తన మొదటి కాంబినేషన్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ RP పట్నాయక్ అహింసా (Ahimsa Movie) కోసం మళ్లీ కలిశారు. ఎంపిక చేసిన థియేటర్లలో నిన్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈరోజు యూట్యూబ్‌లో విడుదల చేశారు.

చాలా యాక్షన్‌తో కూడిన గ్రామీణ ప్రేమకథ గురించి టీజర్‌ (Ahimsa teaser) చూస్తే మనకు అర్థమవుతుంది. తేజ గతంలో వచ్చిన జయం, నువ్వు నేనే మరికొన్ని చిత్రాలలో ఇదే నడిపించినటు ఈ సరికొత్త అహింస టీజర్ చూస్తే తెలుస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ, హీరో సాదాసీదాగా, అమాయకంగా ఉంటాడు, అయితే కొన్ని అనుకోని పరిస్థితులు అతన్ని హింసాత్మక మార్గంలోకి వెళ్తాడు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఈ నేపథ్యంలో ఎవరు సినిమా తీశారు అంటే ఈది తేజ మార్క్ అంటారు. మళ్లీ దర్శకుడు తేజ తన పాత చింతకాయ పచ్చడి స్టోరీతో రావడం కొంచెం నిరాశ కలిగిస్తుంది అని చెప్పాలి. గౌత‌మ్ బుద్ధుడు పాటించిన అహింస‌ను త‌ను ఫాలో అవ‌ట‌మే కాకుండా.. అంద‌రూ అదే ప‌ద్ధ‌తినే ఫాలో కావాలనుకుంటుంటాడు.

Rana brother Abhiram Daggubati new movie Ahimsa teaser is out
Rana brother Abhiram Daggubati new movie Ahimsa teaser is out

విజువ‌ల్స్ చాలా చ‌క్క‌గా ఉన్నాయి. గీతిక (Geethika) ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. అభిరామ్ (Abhiram Daggubati) నటన పర్వాలేదు అనిపిస్తుంది. ఆనంద్ ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతానికి దర్శకుడు తేజ కొత్త సినిమా అయినా అహింస టీజర్ (Ahimsa teaser) ని ఆకట్టుకునే స్థాయిలో చూపించలేకపోయారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అహింస టీజర్ (Ahimsa teaser) పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

- Advertisement -

 

Web Title: Abhiram Daggubati’s Ahimsa teaser is out.. rana brother Abhiram Daggubati new movie Ahimsa, ahimsa movie telugu cast

Related Articles

Telugu Articles

Movie Articles