Homeసినిమా వార్తలుఆస్కార్ కొత్త మెంబెర్ గా ఎన్టీఆర్ కి గొప్ప గౌరవం.!

ఆస్కార్ కొత్త మెంబెర్ గా ఎన్టీఆర్ కి గొప్ప గౌరవం.!

NTR On Oscar Academy, Jr NTR In Academy’s Class Of Actors, Academy welcomes Jr NTR to Actor’s Branch Member, Devara, Jr NTR, Devara shooting update

NTR On Oscar Academy, Jr NTR In Academy’s Class Of Actors, Academy welcomes Jr NTR to Actor’s Branch Member, Devara, Jr NTR, Devara shooting update.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్న సినిమా దేవరా గురించి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీఆర్ కి గొప్ప గౌరవం దక్కింది. దేవరా సినిమా అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ తెలియటంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ స్థాయిలో పేరు వచ్చింది.

ఇక విషయానికి వెళ్తే ఈ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ అకాడమీ వారు తమ కొత్త మెంబర్స్ లిస్ట్ లో స్థానం దక్కించారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని అకాడమీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆస్కార్ అకాడమీ మెంబర్స్ లిస్టులో స్థానం దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మన టాలీవుడ్ హీరో కావడం ఒక ప్రైడ్ మూమెంట్ అని చెప్పాలి.

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఎన్టీఆర్ పేరు కనిపించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ గా మారింది దానితోపాటు దేవరాజ్ సినిమా రెండు భాగాలుగా రావడం మొదటి భాగం 2024 ఏప్రిల్ లో విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.