‘ఆచార్య’ హక్కులు సొంతం చేసుకొన్నా ఆదిత్య

0
131
acharya-audio-rights-sold-to-aditya-music
acharya-audio-rights-sold-to-aditya-music

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు చరణ్‌. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఆచార్య టీజర్ రికార్డులను కొట్టింది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

 

టీజర్ లో చిరుతో పాటుగా మణిశర్మ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. తాజాగా ఆచార్య సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. భారీ రేటుకు మ్యూజిక్ రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్ సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. మే 13న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Previous articleఫిబ్రవరి 5న, 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
Next article‘ఉప్పెన’ సినిమాకి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట.