చిరంజీవి ఆచార్య వాయిదా తప్పదా..?

మెగాస్టార్ చిరంజీవి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా నటిస్తున్న సినిమా ఇదే. రామ్చరణ్ ప్రొడ్యూసర్ గా అలాగే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. చిరు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. చ‌ర‌ణ్ జోడిగా పూజా హెగ్డే న‌టించారు.

భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి అలాగే రామ్చరణ్ న‌క్స‌లైట్స్‌గా కనిపించనున్నారు. ఆచార్య సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అలాగే ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4కి సన్నాహాలు చేయగా మళ్లీ వాయిదా తప్పేటట్టు కనబడుతుంది.

ఇప్పటికే కోవిడ్ కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ అలాగే RRR మూవీ వాయిదా వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడు థియేటర్స్ విషయంలో ఇప్పుడు ఇబ్బందులు లేవు. కానీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడమో చేస్తారు.

acharya movie postpone again
acharya movie postpone again

అది కాక ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ సమస్య ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆచార్య రిలీజ్ కూడా వాయిదా ప‌డుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరి ఆచార్య ప్రొడ్యూసర్స్ దీని గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. సోనూ సూద్ విల‌న్‌ నటించిన ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

Telugu Articles

Movie Articles