కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో వస్తున్న ఆచార్య మూవీ కొత్త రిలీజ్ డేట్ ని (Acharya New Release Date) ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఆచార్య (Acharya) సినిమా కనుమ పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో పాటు ఆచార్య సినిమా ఏప్రిల్ 1 నుండి రిలీజ్ (Acharya On April 1st Release) అవుతుందని ప్రకటించారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ ఆచార్య (Acharya) ఫిబ్రవరి 4న రిలీజ్ చేద్దామని భావించారు. కానీ ఇప్పుడు చెప్పిన టైంకి రావడం లేదని సంక్రాంతి రోజు అఫీషియల్ గా వెల్లడించారు.
ఇప్పుడు ‘ఆచార్య’ను కూడా పోస్ట్ పోన్ చేయడం మెగాభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తమ ఆచార్య (Acharya) విడుదల చేయడం లేదని పేర్కొంది. తాజాగా ఈ సినిమా ఆచార్య (Acharya) కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. సమ్మర్ బరిలో ఈ సినిమాని నిలపబోతున్నారు. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావడం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సారి వేసవిలో సినిమాల మధ్య పోటీతో పాటు వినోదం మరింత పెరగనుంది.