ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ’జెంటిల్‌మేన్ 2’

0
640
action king arjun shankar gentleman movie sequel ready to go on floors says producer kt kunjumon

Gentleman 2 Action Kign Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) హీరోగా శంకర్ దర్శకత్వంలో తొలి సినిమాగా తెరకెక్కిన చిత్రం ‘జెంటిల్‌మేన్’. (Gentleman) దర్శకుడిగా తొలి సినిమాతోనే తన గట్స్ ఏంటో చూపించాడు శంకర్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (gentleman movie sequel) తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత కే.టీ.కుంజుమోన్ ప్రకటించాడు.

కథా బలం ఉన్న చిత్రాలను బిగ్ స్కేల్‌లో నిర్మించి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన డేరింగ్ నిర్మాత కె.టి.కుంజుమోన్. ఫేమస్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వ‌హించిన మొద‌టి సినిమా ‘జెంటిల్‌మేన్’‌ను కుంజుమోన్. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా హీరో అర్జున్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు సందేశం ఇచ్చి దక్షిణాది ప్రేక్షకులను తనవైపు తిప్పుకుని పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు శంకర్. ఈ సినిమాతో హీరోగా అర్జున్‌తో పాటు దర్శకుడిగా శంకర్ పేరు మారు మోగిపోయింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. ‘వ‌సంత‌కాల ప‌ర‌వై’, ‘సూరీయ‌న్’ వంటి బిగ్ బ‌డ్జెట్ మూవీస్ నిర్మించిన కె.టి.కుంజుమోన్.. 1993లో శంకర్‌ని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ‘జెంటిల్‌మేన్’ చిత్రాన్ని నిర్మించారు.

పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘జెంటిల్‌మేన్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత కే.టీ.కుంజుమోన్ ప్రకటించాడు.ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తమిళం, తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు.

సినిమాను ప్రకటించిన సంద‌ర్భంగా కుంజుమోన్ మాట్లాడుతూ.. ‘‘జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువాదమై అన్ని దేశాల ప్రేక్షకుల‌ నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే, మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్పద‌నంతో ‘జెంటిల్‌మేన్ 2’ తెర‌కెక్కిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని అన్నారు.

Previous articleరెండు న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సురేష్ బాబు…!
Next articleకొత్త లుక్‌లో మెగాస్టార్ కెవ్వుకేక..!