వరదలపై సెటైర్: ట్విట్టర్ నుంచి వైదొలిగిన నటుడు

actor brahmaji quits from twitter over trolled by netizens

Brahmaji: సినీ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్ నగరంలో వినాశనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. హైదరాబాద్ వరదలను ఉద్దేశించి ఆయన సరదాగా చేసిన ఒక ట్వీట్ మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

గడిచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌‌లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో నాలాలు, చెరువులు పొంగి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే బ్రహ్మజీ ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో తన ఇల్లు మునిగిందని.. వీధి అంతా నీటితో నిండిందని బ్రహ్మాజీ ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేశారు. అంతేకాదు ‘తనకు ఒక పడవ కావాలని.. కొంటానని..ఎక్కడ ఉందో చెప్పాలని ’ జోక్ చేశాడు.

దీంతో ఈ మెసేజ్ చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. బ్రహ్మాజీపై ట్రోలింగ్‌కి దిగారు. హైదరాబాద్ వరద పరిస్థితులు, కష్టాల గురించి నీ లాంటి సెలెబ్రిటీలు జోకులు వేయడం, సెటైరికల్ కామెంట్స్ చేయడం సరికాదంటూ ఫైర్ అయ్యారు. చిన్న జోక్ కాస్త బూమరాంగ్ అయ్యి మొత్తం గందరగోళానికి దారితీసింది. ట్విట్టర్ లో ట్రోల్స్ కు బ్రహ్మాజీ చాలా అప్సెట్ అయినట్టు సమాచారం. అందుకే, ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన ట్విట్టర్‌ను వీడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *