విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..

0
554
breaking_ actor jaya prakash reddy passed away

Jaya Prakash Reddy death: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలిసి టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడుతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టారు. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది. రాయలసీమ యాసలో జయ ప్రకాష్ మాట్లాడే తీరు మంత్ర ముగ్దుల్నీ చేస్తుంది.

కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై తనదైన మార్క్ వేసుకున్న ఆయన.. చివరగా మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించారు. విలనిజం పండించడంలో కోట శ్రీనివాస రావు తర్వాత జయ ప్రకాష్ అని చెప్పోచ్చు. అంతలా తన మాటలతో ఆకట్టుకోగలడు. దర్శకరత్న దాసరి నారాయణ రావును ఆయనను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.