చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు మనోజ్..!

Manchu Manoj: సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను సినీ హీరో మంచు మనోజ్‌ పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆయన సింగరేణి కాలనీకి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యంత క్రూరత్వమైన చర్య ఇదని ఆయన అన్నారు.

‘క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలి. ఇప్పటికీ నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు అంటున్నారు.

ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. నిందితుడిని 24 గంటల్లో అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మంచు మనోజ్. చిన్నారి ఫ్యామిలీకి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Actor Manchu Manoj Visited the Family Members of Molested Child in Saidabad Singareni Colony

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles