నాని 150 కోట్ల రేంజ్.. సినిమాలకు ఇంత మార్కెట్ ఉందా..?

424
Actor Nani 150 crore business with Tuck Jagadish and Shyam Singha Roy movies

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా వున్నాడు నాని, ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్రీకరణలో ఉండగానే ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాను లైన్ లో పెట్టి ఆ తర్వాత చేయబోయే ‘అంటే సుందరానికి’ మూవీని కూడ లైన్ క్లియర్ చేసాడు. ఈ క్రమంలో నేటి (డిసెంబర్ 21) నుంచి ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్ర యూనిట్ దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా వదిలింది. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి – గార్జియస్ కృతి శెట్టి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించనున్నారు.

దీనికితోడు నాని మూవీ సెట్స్ కి వెళ్లకముందే డీల్స్ ఫైనల్ అవ్వడం చూస్తున్న వారు మరింత ఆశ్చర్యపోతున్నారు. వచ్చే సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘టక్ జగదీష్’ మూవీని 47 కోట్లకు విక్రయించారు అన్న వార్తలు షాకింగ్ గా మారాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ ఫిల్మ్‌లో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈమూవీ తరువాత నాని నటించబోయే వివేక్ ఆత్రేయ మూవీ ‘అంటే సుందరానికి’ ని జీ 5 వాళ్లు 52కోట్లకు ఎ టు జడ్ హక్కులను కొనుక్కున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా నాని నటిస్తున్న మూడు సినిమాల బిజినెస్ 150 కోట్ల రేంజ్ కి దాటి పోవడంతో ఈ కరోనా పరిస్థితులలో కూడ నాని సినిమాలకు ఇంత మార్కెట్ ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది.అంతేకాదు వచ్చే ఏడాది నాని వైపు నుండి ఈ మూడు సినిమాలు వరసగా రిలీజ్ కాబోతున్నాయి.