malayam actress nazriya fahadh in nani and vivek athreya film

Nani 28 Nazriya Fahadh : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారారు. తన 25వ చిత్రం ‘వి’తో నిరాశపరిచిన నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అనంతరం 27వ సినిమా ‘శ్యామ్ సింగరాయ్‌‌‌’లో నటించాల్సి ఉంది. దానికి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే నాని తన 28వ సినిమాను అనౌన్స్ చేసేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వివరాలను యూనిట్ వెల్లడించింది.’మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమా డైరెక్టర్.

నాని సరసన మలయాళీ భామ నజ్రీయా నజీమ్‌‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన నజ్రియా ఆమద్య కొన్నాళ్ల పాటు సినిమాల దూరంగా ఉన్న ఈమె మళ్లీ గత ఏడాది నుండి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన తమిళ సినిమా తెలుగులో రాజా రాణి గా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇదే నెల 21న ప్రకటించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీ తర్వాత ఈ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.