Actor Nani Gang Leader Movie Team Change Title To Nani Gang Leader
Actor Nani Gang Leader Movie Team Change Title To Nani Gang Leader

టాలీవుడ్ లో ఒకే సినిమా టైటిల్ కోసం ఇద్దరు పట్టుబట్టడం అనేది ఎప్పటినుండో ఉంది.పవన్ కళ్యాణ్ తన సినిమాకి కాటంరాయుడు అని పేరుపెట్టుకున్నాడు.నిజానికి ఆ పేరుని సప్తగిరి సినిమాకోసం రిజిస్టర్ చేయించుకున్నారు.కానీ పవన్ కి ఆ టైటిల్ అవసరం అని అడగడంతో ఆ టైటిల్ పవన్ కి ఇచ్చేసి వాళ్ళు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే టైటిల్ సెట్ చేసుకున్నారు.

అయితే అన్ని సార్లు సర్దుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు.మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమాకి ఖలేజా అనే టైటిల్ అనుకున్నారు.కానీ అంతకుముందే అది వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు.ఏ విధంగానూ ఆ ఇష్యూ సెటిల్ కాకపోవడంతో ఆ సినిమాని మహేష్ ఖలేజా పేరుతో రిలీజ్ చేసారు.అప్పుడు పెద్ద గొడవ జరిగింది.అలాగే YVS చౌదరి ప్రొడ్యూసర్ గా రవితేజ హీరో గా తెరకెక్కిన సినిమాకి ముందు కత్తి అనే టైటిల్ అనుకుని రిజిస్టర్ చేయించారు.కానీ కళ్యాణ్ రామ్ తన సినిమాకి అదే పర్ఫెక్ట్ టైటిల్ అని కళ్యాణ్ రామ్ కత్తి అనే టైటిల్ తో తన సినిమా రిలీజ్ చేసుకున్నాడు.దాంతో రవితేజ సినిమాకి నిప్పు అనే టైటిల్ పెట్టుకున్నారు.

ఇప్పుడు నానీ గ్యాంగ్ లీడర్ కూడా టైటిల్ కాంట్రవర్సీ లో చిక్కుకుంది.ఆ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు దాన్ని వదులుకోవడానికి ఒప్పుకోవట్లేదు.దాంతో ఈ సినిమా టైటిల్ కి ముందు నానీ అనే పేరు తగిలించి నానీ గ్యాంగ్ లీడర్ అని టైటిల్ కార్డు గా వేస్తారు.సినిమా కాన్సెప్ట్ ప్రకారం గ్యాంగ్ లీడర్ అనేది పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుండడంతో యూనిట్ దాన్ని వదులుకోవడానికి ఒప్పుకోవట్లేదు.కానీ ఇలా టైటిల్ కాంట్రవర్సీ ఎదుర్కున్న ఏ సినిమా కూడా హిట్ అయినా దాఖలాలు లేవు.మరి నానీ గ్యాంగ్ లీడర్ ఎలా ఈ నెగెటివ్ సెంటిమెంట్ ని ఎదుర్కొని నిలబడుతుందో,ఏ రేంజ్ విజయం అందుకుంటుందో చూడాలి.