Actor Nani Gang Leader Teaser Talk, Release Date, Cast Crew
Actor Nani Gang Leader Teaser Talk, Release Date, Cast Crew

[INSERT_ELEMENTOR id=”3574″]

నానీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్.జెర్సీ సినిమాతో అందరిని ఏడిపించేసి ఎమోషనల్ హిట్ అందుకున్న నానీ విక్రమ్.కె.కుమార్ తో జతకట్టాడు.గ్యాంగ్ లీడర్ అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టినా కూడా సినిమాలో కామెడీ ఉంటుంది అని సినిమా ఫస్ట్ అప్డేట్ నుండే ఇన్ డైరెక్ట్ గా కన్వే చేసారు.కానీ టీజర్ లో మాత్రం ఇది ఫుల్ ప్లెడ్జెడ్ కామెడీ మూవీ అని చెప్పేసారు.

టీజర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హ్యూమరస్ గానే ఉంది.ఈ సినిమాలో నానీ పెన్సిల్ అనే వెరైటీ పేరున్న రివేంజ్ రైటర్ గా కనిపిస్తున్నాడు.అయితే అతని దగ్గరికి వచ్చిన అయిదుగురు ఆడాళ్ళు పగ తీర్చుకోవాలని చూస్తుంటారు.తాను రాసుకున్న రివేంజ్ ఐడియాస్ తో వాళ్ళ పగ తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తాడు నానీ.మామూలుగా వినడానికి ఈ లైన్ చాలా వైలెన్స్ తో కూడుకున్నట్టు ఉంది.కానీ విక్రమ్.కె.కుమార్ ఈ లైన్ కి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే జోడించాడు.డైలాగ్స్ కూడా చాలా క్రిస్ప్ గా ఉన్నాయి.విక్రమ్ తనకి బాగా పట్టున్న సిట్యుయేషనల్ కామెడీ ని ఎంచుకుని ఈ లైన్ ని డెవలప్ చేసాడు.కాస్త వర్త్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా పడితే దానికి పాస్ మార్క్స్ వేయించే సత్తా ఉన్న నానీ ఈ సారి కూడా కామెడీ ప్లస్ ఎమోషనల్ టచ్ ఉన్న క్యారెక్టర్ ని ఎంచుకున్నాడు.

సినిమా కథ ఎలా ఉన్నా పెన్సిల్ అనే క్యారెక్టర్ తోనే ఈ సినిమాని నిలిబెట్టేస్తాడు అని టీజర్ తోనే కన్వే అయిపోయింది.ఈ సినిమాతో ప్రియాంక మోహన్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.రీసెంట్ గా ఓ బేబీ తో హిట్ అందుకున్న సీనియర్ నటి లక్ష్మి కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.అలాగే సీనియర్ తమిళ్ యాక్టర్ శరణ్య కూడా ప్రామినెంట్ పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నకార్తికేయ లుక్ ని పూర్తిగా రివీల్ చెయ్యలేదు.అనిరుథ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారబోతుంది అని అర్దమైపోయింది.ఓవర్ ఆల్ గా నానీ తన గ్యాంగ్ తో కలిసి ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చేస్తున్నాడు అని అర్ధమైపోయింది….గెట్ రెడీ.

[INSERT_ELEMENTOR id=”3574″]