డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నవదీప్‌

0
22
Actor Navdeep appears before ED in Tollywood Drug Case

Tollywood Drugs Case Navdeep: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయనతో పాటే ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ సైతం ఈడీ విచారణకు హాజరైయ్యారు. అయితే ఇదివరకు విచారణకు హాజరైన వాళ్ళతో పోలిస్తే, నవదీప్ విచారణ కాస్త ఎక్కువే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈడీ ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. అయితే నవదీప్ ను ఈడీ అధికారులు ఒత్తిడి పెంచే ప్రశ్నలు అడగటానికి ప్రధానమైన కారణం ఎఫ్ క్లబ్ వ్యవహారమే..

ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలెవరు? అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెలెబ్రిటీలందరు వీకెండ్ లో ఇదే పబ్ కు ఎక్కవగా వస్తుంటారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో నవదీప్ కు వున్నా సంబంధాలు ఈడీ అడిగి తెలుసుకోనుంది.

Actor Navdeep appears before ED in Tollywood Drug Case

కాగా.. మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు అగమ్యగోచరంగా తయారైనట్లు సమాచారం. ఇప్పటివరకూ పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నందు, రానా, రవితేజలను విచారించినా నిధుల బదిలీపై ఆధారాలేవీ లభించనట్లు తెలుస్తోంది.

 

Previous articleఖ‌రీదైన కారు కొనుగోలు చేసిన చ‌ర‌ణ్‌..!
Next articleవిజయ్ దేవరకొండ కొత్త బిజినెస్.. !