శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్..!

0
2644
Actor Nutan Naidu Arrested In Karnataka Udupi

Nutan Naidu arrested: విశాఖ శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును పోలీసులు కర్ణాటకలోని ఉడుపిలో అదుపులోకి తీసుకున్నారు.

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శిరోముండనం కేసులో కాక.. నూతన్ నాయుడు మరికొందరి పేర్లు వాడుకుని మోసాలకు పాల్పడ్డట్లు తెలిసిందని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో పోలీసులకు ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయాలని చూశారని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో అడ్డంగా బుక్కయ్యారని సీపీ వెల్లడించారు.

Previous articleప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలో ఆలస్యం లేదు
Next article“Adipurush” starts with these scenes.?