actor posani krishna murali interesting comments on ap cm ys jagan wife bharati-min

Posani krishna murali Comments Sonu Sood గురించి ఇప్పుడు ఎవరినన్నా చెప్పమంటే.అతను ఓ సినిమా నటుడు అని చెప్పడం మర్చిపోయి, అతను ఓ ఆపద్బాంధవుడు అని చెప్తారేమో. నిజమే.ఎందుకంటే అతను చేసిన సేవలు అటువంటివి మరి. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వలస కార్మికులకు ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు మన సోనుసూద్.సహాయం కోసం ఎదురు చూసే అన్నార్తులకు ఇప్పటికీ తనకున్న దాంట్లో సాయం చేస్తూనే ఉన్నాడు.

అంతటితో ఆగకుండా.పేదలకు సహాయం చేసేందుకు ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి సాయం చేస్తున్నాడు.ఇకపోతే ఇలాంటి నిస్వార్ధ సేవకుడిని టార్గెట్ చేసుకొని పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. రాష్ట్రంలో జనాలకు చాలా సమస్యలున్నాయి.. వారిని జగన్ ఆదుకుంటున్నారన్నారు. విద్యార్థులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి చాలా చేస్తున్నారని.. రైతులు, చేనేతలు, ఆటో డ్రైవర్లను ఆదుకున్నారన్నారు. జగన్ పుట్టుక ముందే ఆయన కుటుంబం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతోందని.. 15 రోజులు పులివెందుల్లో ఉన్నా.. అక్కడి జనాలతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.

తాను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఏ పదవి ఆశించలేదన్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఇక ఏపీలో మూడు రాజధానుల విషయంపై స్పందించిన ఆయన.. పరిపాలనా వికేంద్రీకరణ మంచి నిర్ణయమే అన్నారు. అమరావతి రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తారన్నారు. ఏపీ సీఎం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని.. రాష్ట్రంలో ప్రాజెక్టుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అంతటితో ఆగకుండా… వాటిని దృష్టిలో పెట్టుకొని, సోనుసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు ఎక్కువగా సేవ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు పోసాని.