డ్రగ్స్ కేసు: హీరోయిన్ ఇంట్లో సీసీబీ సోదాలు..!

0
714
Ragini Dwivedi Drug Case, Ragini Dwivedi, Drug scandal, Central Crime Branch, Bengaluru Drug Case

కర్ణాటకలో తలెత్తిన డ్రగ్స్ వివాదం (Drug Case) మరింత మంది తారల మెడకు చుట్టుకుంటుండటంతో శాండల్‌వుడ్‌లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ నటి రాగిణి ద్వివేదిని (Ragini Dwivedi) సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని (Bengaluru) సీసీబీ కార్యాలయానికి తరలించి ఆమెను ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసును విచారణకు స్వీకరించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) శుక్రవారం బెంగళూరులోని రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు నిర్వహించింది. కోర్టు మంజూరు చేసిన సెర్చ్ వారెంట్‌తో మహిళా ఇన్‌స్పెక్టర్‌తో సహా సీసీబీ అధికారులు యలహంకలోని రాగిణికి చెందిన రెండు ఇళ్లలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సోదాలు నిర్వహించారు. సంజనా మిత్రుడు రాహుల్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాహుల్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌లో వీడియోలు, ఫొటోలు చూసిన సీసీబీ అధికారులు మరింత మందిని గుర్తించినట్లు తెలుస్తోంది.

రాగిణి ఇళ్లలో సోదాలు నిర్వహించిన తరవాత ఆమెను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను సీసీబీ కార్యాలయానికి తరలించారు. రాగిణి తన లాయర్లతో కలిసి సొంత వాహనంలో సీసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, రాగిణి ఇళ్లలో అధికారులు ఎలాంటి మాదకద్రవ్యాలు గుర్తించలేదని, రెండు ఆల్కహాల్ బాటిళ్లను మాత్రమే గుర్తించారని సీసీబీ వర్గాల ద్వారా తెలిసింది.

రాగిణి తమిళంలోనూ రెండు చిత్రాలు చేశారు. తెలుగులో నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో నటించారు. రాగిణి తెలుగులో నటించిన ఏకైక సినిమా ఇది.

Previous articleఎకె రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌
Next articleప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలో ఆలస్యం లేదు