Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన రానా

0
25
Actor Rana Daggubati appears before ED in tollywood drugs case

Tollywood Drugs Case: డ్రగ్స్ సరఫరా, మనీ లాండరింగ్ ఇష్యూలను సీరియస్‌గా తీసుకున్న ఈడీ అధికారులు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌, యాక్టర్ నందు విచారణకు హాజరు కాగా.. తాజాగా నేడు (బుధవారం) హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati) వంతు వచ్చింది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.

విచారణలో భాగంగా బుధవారం ఉదయం కథానాయకుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు.

Actor Rana Daggubati appears before ED in tollywood drugs case

రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఎఫ్ క్లబ్ (f club) వ్యవహారాల్లో నవదీప్, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 9న ఇదే కేసులో ర‌వితేజ విచారణకు హాజ‌రుకానున్నారు.