‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటున్న రవితేజ..!

Ravi Teja Ramarao On Duty: మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో RT68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రానికి `రామారావు ఆన్ డ్యూటీ`(Ramarao On Duty) అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ రోజు ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) చిత్రానికి నూత‌న దర్శ‌కుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల‌చేసిన రెండు పొస్ట‌ర్స్‌లోనూ ర‌వితేజ (Ravi Teja) ముఖం క‌నిపించ‌న‌ప్ప‌టికీ ఆ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ర‌వితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూప‌ర్‌స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే నిజాయితీ మరియు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా ర‌వితేజ నటించార‌ని తెలుస్తోంది.

Ravi teja Next Rama Rao On Duty First Look Out

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే `రామారావు ఆన్ డ్యూటీ` రియ‌ల్ ఇన్స్‌టెండ్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ర‌వితేజ‌, హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోన్న‌ దివ్యాంశ కౌశిక్ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌.

తారాగ‌ణంః
ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్, నాజ‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ఈ రోజుల్లో శ్రీ‌, మ‌ధుసూధ‌న్ రావు, సురేఖ వాణి..

- Advertisement -

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles