పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన సోనూ సూద్‌..!

0
43
Actor Sonu Sood clarity on his political entry rumors

Sonu Sood Political Entry: గత ఏడాదికాలంలో సోనూ సూద్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సోనూ సూద్ కి కోట్లలో అభిమానులు ఏర్పడ్డారు. మరి అలాంటి వ్యక్తి పాపులారిటీని పొలిటికల్ పార్టీలు వాడుకోవాలని చూడడం సర్వసాధారణం. రియల్‌ హీరో సోనూ సూద్‌ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషలిస్ట్ గా పాప్యులర్ అయిన సోనూ సూద్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో అనేక ఊహాగానాలు, కథనాలు తెరపైకి వస్తున్నాయి. 2022 లో జరిగే బృహత్‌ ముంబై ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా సోనూ సూద్‌ దిగబోతున్నారని, ఈ విషయం లో కాంగ్రెస్‌ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఒకరు ట్వీట్ చేశారు. పరోక్షంగా సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు, ఎన్నికల బరిలో కూడా దిగుతున్నట్లు ఆ ట్వీట్ ఉంది.

ఈ నేపథ్యంలో తన రాజకీయ ఎంట్రీపై సోనూ సూద్‌ స్పందించాడు. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్‌ చేశాడు. అయితే అత్యధిక మంది నెటిజన్స్‌ మాత్రం సోనూ భాయ్‌ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ బురలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.