డ్రగ్స్ కేసు గురించి స్పందించిన తనీష్

940
Actor Tanish Gives Clarity On Bangalore Drugs Case Notices

మాదక ద్రవ్యాల కేసు కన్నడ నాట సంలచనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుని విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు తెలుగు నటుడు తనీష్‌తో పాటు మరో ఐదుగురిని విచారణకు హాజరు కావాలని నోటీనులు జారీ చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తనీష్ ఫైనల్స్ వరకు వెళ్లాడు కానీ విన్నర్ కాలేకపోయాడు. ఆ తరువాత పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు.

వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినిమా నిర్మాత కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గతంలో 2017లో డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు తనీష్ హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి ఆయన బెంగుళూరులో విచారణకు హాజరు కానుండడం గమనార్హం. ఈ నేపూథ్యంలో తనీష్ గురించి పలు వార్త ఛానెళ్లలో పలు ఆసక్తికర కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై నటుడు తనీష్ శనివారం స్పందించారు.

ఓ వీడియో సందేశం ద్వారా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నిజా నిజాలేమిటో తెలుసుకోకునేందుకు కనీసం సంప్రదించలేదని అన్నారు. ఆ వార్తలన్నీ తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్ నోటీసులు ఇచ్చిన మాట నిజమేనని, అయితే తనకు వచ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు.

Hero Tanish Gives Clarity On Bangalore Drugs Case Notices

ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్రచారం చేయొద్దు. కొన్ని మీడియాలు న‌న్ను సంప్రదించి న్యాయ‌బ‌ద్ధంగా నిజాల్ని ప్రచురించాయని త‌నీష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. బెంగ‌ళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గ‌తంలో సంప్రదించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయ‌న‌తో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవ‌కాశాల కోసం ఎంద‌రినో క‌లుస్తుంటాం. అభ్యర్థిస్తుంటాం. కానీ, ఆయ‌న‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. అని త‌నీష్ ఓ వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు.