actor tarun to start second innings as a producer in telugu film industry

actor tarun: బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించి ఆ తరవాత హీరోగా మారి లవర్ బోయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు తరుణ్. హీరోగా తొలి సినిమా ‘నువ్వే కావాలి’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ సినిమాలతో స్టార్‌ డమ్ సంపాదించుకున్నారు. అయితే, ఆ తరవాత వచ్చిన వరుస డిజాస్టర్లతో బాగా వెనకబడిపోయారు.

వరుసపెట్టి సినిమాలు చేసినా తరుణ్‌కి కలిసి రాలేదు. రెండేళ్ల క్రితం ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా కలిసి రాలేదు. అందుకే, ఇప్పుడు తరుణ్ హీరోగా చేయడం మానేయాలని నిర్ణయించుకున్నారట. ఎందుకంటే, ఆయన నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్‌లను టేకప్ చేశారని సమాచారం. వాటిలో రెండు ఓటీటీ ప్లాట్‌‌ఫాంస్ కోసం చేస్తుండగా.. మరొకటి థియేట్రికల్ రిలీజ్ కోసం చేస్తున్న సినిమా అని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ తరుణ్ నిర్మాత అవుతున్నారనే విషయం కచ్చితంగా ఆసక్తికరమే.