actor vijay sethupathi minor daughter gets molestation threats via social media

Vijay Sethupathi: శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్నప్పటికీ విజయ్ సేతుపతికి కష్టాలు తప్పడం లేదు. సోషల్మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. విజయ్ సేతుపతి మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల అతడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరుతున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘ ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు.

అయితే ఈ ప్రాజెక్టుకు నుంచి విజయ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆయన కుటుంబాన్ని కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే తాజాగా దుర్మార్గుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ‘విజయ్ సేతుపతి .. ముత్తయ్య మురళీధర్ బయోపిక్లో నటిస్తే అతడి కూతురును రేప్ చేస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై తీవ్ర దుమారం రేగుతున్నది. విజయ్ ఈ సినిమాలో నటించొద్దని ఇప్పటికే తమిళ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు ‘ఇటువంటి సినిమాలో నటించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు’ అంటూ నేరుగా ముత్తయ్య విజయ్కు లేఖ రాశాడు.