నటుడు విజయకాంత్‌కు కరోనా పాజిటీవ్

Actor Vijayakanth: తమిళ రాజకీయ నాయకుడు, నటుడు విజయ కాంత్‌కు కరోనా వైరస్‌ పాజటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘‘విజయ కాంత్‌కు సెప్టెంబర్‌ 22న కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయనకు చెన్నైలోని ఎం.ఐ.ఓ.టీ. హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని, డిశ్చార్జి‌ అవుతారు.’’ అని ఆస్పత్రి మేనేజింగ్‌ డైరక్టర్‌ పృధ్వీ మోహన్‌దాస్‌ ప్రకటించారు.

విజయకాంత్ డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) వ్యవస్థాపక అధ్యక్షుడు. అధికార ఏఐఏడీఎంకేకి  మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఆయన ఆరు నెలలకు ఒకసారి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని..ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు బహిర్గతం కావటంతో పరీక్షలు నిర్వహించగా..వైరస్‌ సోకినట్టు తెలిసిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Related Articles

Telugu Articles

Movie Articles