బుమ్రా, అనుపమ పెళ్లి రచ్చపై క్లారిటీ

496
Actress Anupama Parameswaran Mother gives clarity about Wedding With Jasprit Bumrah

Anupama Parameswaran : మన ఇండియన్ క్రికెట్ టీం ప్లేయర్ బుమ్రాతో అనుపమ ప్రేమలో ఉన్నట్లు.. అంతేకాదు వీరు పెళ్లి చేసుకుంటున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో బుమ్రా, అనుప‌మ వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, వీరిద్ద‌రు అక్క‌డికి బ‌య‌లు దేరార‌ని కూడా ప్ర‌చారం న‌డిచింది. దీనిపై సరైన ఆధారాలు లేవు కానీ ఓ టాక్ అయితే ఉంది.

అనుప‌మ‌, బుమ్రాల పెళ్లికి సంబంధించి క్రేజీ గాసిప్స్ పుట్టుకొస్తున్న నేప‌థ్యంలో అనుప‌మ త‌ల్లి మ‌ల‌యాళం పోర్ట‌ల్‌తో మాట్లాడింది. అసలు ఇదంతా చెత్త అని ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని అను తన ఓ తెలుగు సినిమా షూట్ నిమిత్తం వెళ్ళింది తప్పితే వేరే ఏం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అనుప‌మ త‌ల్లి ఇచ్చిన క్లారిటీతో స‌స్పెన్స్ మ‌ళ్ళీ కంటిన్యూ అవుతూ వ‌స్తుంది. తాజాగా సంజ‌న స్పోర్ట్స్ అన‌లిస్ట్‌ని బుమ్రా పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో చాలా పాపులర్ అయ్యింది. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. అనుపమ 18 పేజేస్ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.