Actress ileana d cruz about on her tollywood movie journey
Actress ileana d cruz about on her tollywood movie journey

సెలెబ్రెటీలకు ఏముంది.. చేతినిండా సినిమాలు ఉంటాయి. హ్యాపీగా తమ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మేకప్ వెనుక ఎన్నో మానని గాయాలు ఉంటాయి. మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. బయటకు వస్తే కెమెరాలు చూస్తూ ఉంటాయి కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఎన్నో బాధాకరమైన ఘటనలు చోటుచేసుకున్నా కూడా ఎవరికీ తెలియకుండా మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు తమ జీవితాల్లో జరిగిన ఘటనలు బయటకు చెప్పుకుంటూ ఉంటారు.

గోవా భామ ఇలియానా కూడా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇటీవల మానసికంగా తాను ఎంతో కృంగిపోయానని తన తాజా చిత్రం ‘పాగల్ పంతీ’ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఇలియానా ఆస్ట్రేలియా కు చెందిన ఆండ్రూ అనే ఫోటో గ్రాఫర్ ప్రేమలో పడింది. కానీ ఏమైందో ఏమో.. వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. ఈ గాయం ఇలియానా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఇలియానా రోజుకు 12 మాత్రలు వేసుకునేదట.. ఇక ఆమె శరీరంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. విపరీతమైన లావు పెరిపోయింది.. దీంతో జిమ్ కి వెళ్ళాలి అన్నా.. కెమెరాలు ఆమెను ఎక్కడ వెంటాడుతాయో అని భయపడిపోయేదట. ఇక ఎలాగోలా ధైర్యం చేసుకుని రీఎంట్రీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది.

ఇలియానా ఇటీవలే తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించింది. ఆమె నటించిన పాగల్ పంతీ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. విమర్శకులు సినిమాను బాగలేదని చెప్పినా.. ఆడియన్స్ మాత్రం మాంచి టైమ్ పాస్ చిత్రమని అంటున్నారు.