Actress Kajal Shares Photo With Her Fiance Goutham In Instagram

Gautham Kajal Agarwal Photos: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. స్నేహితుడు, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోనుంది. ఇప్పటికే వరుడు గౌతమ్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. అయితే జంటగా క్లారిటీతో ఉన్న ఫోటో ఇంతవరకూ ఒక్కటీ ఒకటి కూడా రాలేదు.

అయితే దసరా పండగ సందర్భంగా వారందరినీ సర్‌ప్రైజ్ ఇస్తూ కాజల్‌ తన కలల రాకుమారుడితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ జంట అక్టోబర్ 30 న ముంబైలో ప్రైవేట్ కార్యక్రమంలో డీసెంట్ గా వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు ప్రిపేర్డ్ గా ఉన్నాయిట. ఈ ఫోటోలో.. గౌతమ్ తనకు కాబోయే భార్యను దగ్గరికి తీసుకోగా… కాజల్ అతడి భుజాలపై ఆనుకుని సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి… ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.