వైరల్‌గా మారిన కంగనా ‘తలైవి’ లేటెస్ట్ స్టిల్స్

0
238
Actress Kangana Ranaut Shares Thalaivi New Stills In Twitter

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నేడు(శనివారం డిసెంబరు 5) జయలలిత నాల్గవ వర్ధంతి సందర్భంగా ‘తలైవి’ బయోపిక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కంగనా రనౌత్ దివంగత జయలలిత కు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. ‘జయ అమ్మ వర్థంతి సందర్భంగా ‘తలైవి’ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్. మా టీమ్‌కు, ఎంతో కష్టపడుతున్న మా లీడర్ విజయ్ సార్‌కు ధన్యవాదాలు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తి కాబోతోంది’ అని కంగనా ట్వీట్ చేశారు. జయలలిత పాత్రలో కంగనా కనిపిస్తున్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుటోంది. దీంతో ఈ స్టిల్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కంగనా తాజాగా షేర్ చేసిన ఫోటోలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.

కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి – ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు ఇందూరి – శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేస్తున్నారు.