రజినీ పై నటి సంచలన కామెంట్స్..!

Rajinikanth: kasthuri: కొన్ని రోజుల క్రితం, సూపర్ స్టార్ రజనీకాంత్ తన సాధారణ వైద్య పరీక్షల కోసం యుఎస్ఎకు బయలుదేరారు. రజనీకాంత్ తన భార్య, కుమార్తెతో కలిసి దేశం విడిచి వెళ్ళాడు. రజినీకాంత్ పై నటి కస్తూరి చేసిన రీసెంట్ పోస్ట్ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ఎందుకంటే ఆ పోస్టులో కస్తూరి రజిని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అనే విషయం అర్ధమవుతుంది. కానీ ఆమె అడిగిన విధానం పై సోషల్ మీడియాలో నేటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

ఆరోగ్యం నిలకడ సహకరించక ఆయన ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకునేందుకు అమెరికా వెళ్ళాడు. అయితే రజినీ అమెరికా వెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నటి కస్తూరి.. ‘చాలా రోజులుగా భారతీయులకు అమెరికాలో అడుగు పెట్టేందుకు పర్మిషన్ లేదు. అలాంటి పరిస్థితిలో రజినీ ఎలా వెళ్లారని ప్రశ్నించింది. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ అయినా అలో  చెయ్యట్లేదు. మరి రజినీ ఎలా వెళ్లాడు అనేది పిచ్చిలేపుతుంది’ అంటూ సంచలనానికి తెరలేపింది. అని ఆమె పోస్ట్ చేసింది.

అయితే అందరితో పాటు తాను కూడా రజినీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి బిగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ కస్తూరి పోస్ట్ పై సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం కస్తూరి గృహలక్ష్మి అనే తెలుగు టీవీ సీరియల్ లో నటిస్తుంది. 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles