Actress Keerthy Suresh To Play Sita In Prabhas Adipurush

‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకొని ఇతర భాషా ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది అగ్ర కథానాయిక కీర్తి సురేష్‌. ఆ సినిమా అనంతరం కథాంశాల ఎంపికలో ఆమె ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళా ప్రధాన ఇతివృత్తాలు, నవ్యత కలబోసిన కథల్ని ఎంచుకుంటూ సత్తాచాటుతోంది.

ప్రభాస్‌ కథానాయకుడిగా భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం నేపథ్యంలో ‘ఆది పురుష్‌’ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. మూవీలో సీత పాత్రకు ‘మహానటి’ కీర్తి సురేష్ అయితే బెటర్ అని భావిస్తున్నారట మేకర్స్. అయితే బాలీవుడ్ భామలు చాలామంది సీత రోల్‌ కోసం పోటీ పడుతుండగా.. ప్రభాస్ కూడా కీర్తివైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న ఈ ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఆయనకు జోడీగా సీత పాత్రలో కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకోబోతున్నారని తెలిసింది. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడే ఈ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు.