కేటీఆర్… నా 7500ఎవ‌డు ఇస్తాడు అంటూ హీరోయిన్ ఫైర్.!

0
2749
actress madhavi latha shocking comments on ktr over

Madhavi Latha: KTR: వరుస వివాదాలతో టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది హీరోయిన్ మాధవీలత. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన మాధవీలత (Madhavi Latha).. రీసెంట్ టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌పైన సంచలన పోస్ట్‌లతో వార్తల్లోకి వచ్చింది. తాజాగా నా 7500ఎవ‌డు ఇస్తాడు అంటూ కేటీఆర్ ను ప్ర‌శ్నించింది. నాకు విద్యుత్ చెల్లింపులో అన్యాయం జ‌రిగింది. దీనికి భాద్య‌త ఎవ‌రు అంటూ నిల‌దీసింది.

నా డబ్బు కోసం నేను డిమాండ్ చేస్తున్నానంటూ మాధవీలత… విద్యుత్ బిల్లు చెల్లింపులో తనకు జరిగిన అన్యాయంపై నిలదీసింది. ‘మే నెలలో రూ. 7500 కరెంట్ బిల్లు కట్టాను. ఎయిర్టెల్ యాప్‌లో ద్వారా పే చేశా.. కాని కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ రూ. 7500 కట్టించుకున్నారు..సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళు మెయిల్ పెడితే మేము ఎయిర్టెల్‌కి పే చేసేశాం అన్నారు.

మ‌రి ఇప్పుడు నా 7500 ఎవ‌రు మింగిన‌ట్లు…? ఎవ‌డు ఎవ‌డితో కుమ్మ‌క్క‌య్యారు…? డ‌బ్బులు ఎవ‌రికి ఊరికే రావు స‌ర్… ప్ర‌తి రూపాయి విలువైందే. ఇప్పుడు నా డ‌బ్బులు ఎవ‌రు తిరిగి ఇస్త‌రు అని ప్ర‌శ్నించింది. ఎవ‌డు తినంది పైస‌లు ఎడికి పోయిన‌యి? నాకు తెల్వ‌దు నాకు నా పైస‌లు కావాలి అంటూ కేటీఆర్, కేసీఆర్, విద్యుత్ శాఖ‌ల‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది. త‌ను బిల్లు చెల్లించిన‌ట్లు ఆధారాలున్నాయంటుంది మాధ‌వీల‌త‌. మ‌రీ దీనికి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే సెక్యురిటీ ఇష్యూస్ వల్ల ఫేస్ బుక్‌లో షేర్ చేయలేదని చెప్పింది మాధవీలత.