డ్రాగ్ కేసు పై పూనమ్ సన్సేషనల్ కామెంట్స్..!

0
141
Poonam Kaur comments on tollywood drugs case

Poonam kaur Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలబ్రిటీలు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

2017లో ఎక్సైజ్ శాఖ సిట్ విచారణ జరిపిన డ్రగ్స్ కేసులో లేటెస్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మొదలు పెట్టింది. అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు ఈడీ అధికారులు.

ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, రకుల్, రానా, రవితేజలతో పాటు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ లకు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే విచారణలో భాగంగా మరికొంతమంది నటీనటుల పేర్లు బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Hot Beauty Poonam Kaur comments on tollywood drugs case

‘డ్రగ్స్ అనేది సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఇది సరిహద్దు సమస్య. ఇది రాజకీయ అజెండాకు సంబంధించిన సమస్య. ఇది బలమైన పారలెల్ ఎకానమీ సమస్య. ఈ ఇష్యూపై త్వరలోనే నా స్వీయ అనుభవాలను పంచుకుంటాను. జై హింద్” అని పూనమ్ కౌర్ తాజాగా ట్వీట్ చేసింది. పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 

Previous articleAadhi Pinisetty Next Clap Teaser From This Date
Next articleRuhani Sharma Latest Photo Shoot