ఆసక్తిరేపుతున్నరమ్యకృష్ణ ఫస్ట్‌లుక్ పోస్టర్

0
3
Actress Ramya Krishnan First Look poster From Sai Dharam Tej Republic movie

కెరీర్ ప్రారంభం వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఓ ఇన్‌టెన్సిటీ ఉన్న పాత్రను సాయితేజ్ పోషిస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్ రిపబ్లిక్ల్‌లో విలక్షణ నటి రమ్యకృష్ణ “తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!” భావించి విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన పవర్‌ఫుల్ ఫెర్ఫామెన్స్‌తో మెప్పించనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Actress Ramya Krishnan First Look poster From Republic movie