NTR30 Second Heroine: RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే ఫాలోవర్స్ ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వంలో ఇది రెండో సినిమా కావటం అలాగే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ చేస్తుంది అయితే ఇక్కడే మరో కీలకమైన పాత్ర కోసం క్రేజీ హీరోయిన్ ని కొరటాల టీం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
NTR30 Second Heroine: NTR30 షూటింగు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే యాక్షన్స్ సన్నివేశాలని చిత్రీకరణ చేసినట్టు సమాచారం. అలాగే ఒకే నెలలో రెండు షూటింగ్ షెడ్యూల్స్ ని కొరటాల శివ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ NTR30 సినిమా రెండో హీరోయిన్ కూడా ఉందంట.. కీలకమైన పాత్ర కోసం సాయి పల్లవి (Sai Pallavi) ని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టకముందు లే సాయి పల్లవి హీరోయిన్ (Sai Pallavi) అంటూ చాలా కథనాలు నడిచాయి. మళ్లీ లేటెస్ట్ గా సాయి పల్లవి ని (Sai Pallavi) ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం తీసుకున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలో గనుక నిజం ఉంటే ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ కి పండగనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అలాగే సాయి పల్లవి డాన్స్ కాంబినేషన్ సూపర్ అంటూ ఫ్యాన్స్ అందరూ చాలా వీడియోస్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయటం కూడా జరిగింది.
మరి సాయి పల్లవి (Sai Pallavi) ఎన్టీఆర్ 30 సినిమాలో ఉందో లేదో మరికొన్ని రోజులు పోతే గాని తెలియదు. ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ (Koratala Siva) లెంగ్తీ షెడ్యూళ్లు ని మే సెకండ్ వీక్ నుండి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.NTR30 కథలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా తన లుక్ పరంగా చాలానే కష్టపడినట్టు చెబుతున్నారు.
కొరటాల శివ కూడా కథ మీద బాగానే కసరత్తు చేసి షూటింగ్ కి వెళ్లడం జరిగిన విషయం తెలిసిందే. మరి NTR30 కథలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి. ఎన్టీఆర్ – కొరటాల శివ గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ భారీ హిట్ అవటంతో ఈ సినిమాపై కూడా రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.