Actress Shriya Saran caught by London police
Actress Shriya Saran caught by London police

టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది శ్రియ. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు ఆమె ఎక్కువగా చేయట్లేదు. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. తాజాగా ఈమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం శ్రియ ‘సందకారి’ అనే తమిళ సినిమాలో నటిస్తుంది.

విమల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ మాదేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్‌ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. ఇటీవల ‘సండైక్కారి’ చిత్ర షూటింగ్‌ లండన్‌లోని స్టెన్‌పోర్టు విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ షూటింగ్‌లో విమల్, శ్రియ, సత్యన్‌ పాల్గొన్నారు.

అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లోని ఓ హై సెక్యురిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్ళిందట. దీంతో పోలీసులు గన్ పాయింట్ లో ఆమెని పట్టుకున్నట్టు సమాచారం. అక్కడే షూటింగ్ జరగుతుంది కదా అని.. సరదాగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళ్ళి.. శ్రియ అలా ఇరుక్కుపోయినట్టు స్పష్టం అవుతుంది.ఇక వెంటనే విషయం తెలుసుకున్న.. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే వెళ్ళి పోలీసులతో మాట్లాడారట. ఆ సమయంలో డాక్యుమెంట్స్ చూపిస్తేనే కానీ.. పోలీసులు శ్రీయ ను వదిలిపెట్టలేదని తెలుస్తుంది. అయితే ఈ విషయమై శ్రియ నుంచి కానీ యూనిట్ సభ్యుల నుంచి కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.