Actress Taapsee Pannu Fined For Bike Riding While Without Helmet

ప్రముఖులు అయినా స్టార్స్ అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ తాప్సీ పన్నుకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు జరిమానా విధించారు. తాప్సీ ప్రస్తుతం ‘లక్ష్మీ రాకెట్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయి పరిసరాల్లో జరుగుతోంది.

హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు గాను ఫైన్ విధించారు. ఫైన్ పడటానికి కొద్ది సమయం ముందు ఈ ఫొటో అంటూ తాప్సి ఈ ఫొటోను షేర్ చేసింది. ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా తాప్సీ హైవేపై బుల్లెట్‌ నడిపింది. అయితే ఆమె హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపడం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ముంబయి పోలీసులు జరిమానా విధించారు. తాప్సీ పోస్ట్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. తాప్సీకి జరిమానా పడిందా? అంటూ కొందరు సరదగా కామెంట్ చేస్తుంటే.. మరికొందకేమో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించొద్దంటూ సలహాలు ఇస్తున్నారు.