Actress Tamanna Home Came After Recover From COVID 19

Tamanna bhatiaa: తమన్నా భాటియా కోవిడ్ నుంచి కోలుకుని ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దాదాపు 14 రోజుల దిగ్బంధన వ్యవధిని పూర్తి చేసిన తరువాత మిల్కీ తిరిగి షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నానని ప్రకటించింది.

వారం రోజులకే కోలుకున్నప్పటికీ కొద్దిరోజులు నగరంలోనే హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ముంబయికి చేరుకున్నారు. ‘ఇంత తర్వగా కోలుకుంటానని అనుకోలేదు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల ప్రార్థనలతోనే త్వరగా బమటపడ్డారు. ఇప్పుడు నేనే ఇమ్యునిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది’ కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ముంబైలో తన నివాసానికి కార్ లో వెళ్లిన తమన్నాను అమ్మా నాన్నలు హగ్ ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన వీడియోని మిల్కీ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసింది.