actress tamannaah bhatia parents test positive for covid-19

బాహుబలి బ్యూటీ.. స్టార్ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తమన్నానే ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే టీవీ, సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు చాలామంది కరోనా బారిన పడ్డారు. అమితాబ్, రాజమౌళి, సింగర్ సునీత, రవిక్రిష్ణ ఇలా చాలామంది కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు.

తన పేరెంట్స్‌లో చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో జాగ్రత్తలు పాటిస్తూ కరోనా పరీక్షలు చేయగా.. తన పేరెంట్స్‌కి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు తెలిపారు తమన్నా. అయితే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి డాక్టర్ల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలియజేశారు తమన్నా. ఇక తాను కూడా పరీక్షలు చేయించుకున్నానని.. తనకు నెగెటివ్ వచ్చిందని వివరించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా నెగెటివ్ అంటూ పేర్కొంది. తన తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వివరించింది.