Tammana Bhatia, Film News, Tollywood Actress
Tammana Bhatia, Film News, Tollywood Actress

హారర్…ఈ జోనర్ పురాతనకాలం నుండి ఉంది.అయినా కూడా కాస్త కొత్త పాయింట్ తో ఈ జోనర్ లో సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గల గల మామూలుగా ఉండదు.ఈ విషయాన్ని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.రీసెంట్ గా వచ్చిన కాంచన-3 అయితే హారర్ కి కాస్త కామెడీ టచ్ ఇస్తే చాలు పరమ రొటీన్ కంటెంట్ తో కూడా బంపర్ హిట్ గ్యారంటీ అని 100 కోట్ల వసూళ్ళ సాక్షిగా నిరూపించింది.

తమన్నా కి అవకాశాలు తగ్గి,హిట్ చూసి చాలా కాలం అయిన టైం లో వచ్చిన ట్రై లింగువల్ సినిమా అభినేత్రి ఆమె కెరీర్ కి చాలా హెల్ప్ అయ్యింది.ఆ సినిమా హిందీ లో పెద్దగా ఆడకపోయినా మిగతా భాషల్లో మాత్రం ఫుల్ గా డబ్బులు తెచ్చిపెట్టింది.బాహుబలి కాకుండా ఈ మధ్య కాలంలో తమన్నాకి చెప్పుకోదగ్గ సినిమా ఇదే.అందుకే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ చేసారు.మే 31 న ఈ డెవిల్ సినిమా ప్రేక్షకులను భయపెట్టడానికి ఫిక్స్ అయ్యింది.ఇందులో తమన్నా కి జంటగా ప్రభుదేవా కూడా డెవిల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.సీనియర్ డైరెక్టర్ చక్రి తోలేటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంది తమన్నా.కామోషి పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమా కూడా హారర్ మూవీ కావడం విశేషం.

అంతకన్నా పెద్ద విశేషం ఏంటంటే కామోషి లో కూడా ప్రభుదేవా హీరో కావడం.ఇక అసలు హైలైట్ ఇక్కడే ఉంది.అదేంటంటే ఈ సినిమా కూడా అభినేత్రి సీక్వెల్ తో పాటు ఒకేరోజు థియేటర్స్ లోకి రాబోతుంది.అంటే మే 31 న రెండు హారర్ సినిమాలతో తమ లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు తమన్నా అండ్ ప్రభుదేవా.కాకపొతే అభినేత్రి-2 తమిళ్ వెర్షన్ కి ప్రభుదేవా ప్రొడ్యూసర్ కూడా కావడంతో ఆ సినిమా హిట్ అవ్వాలి అనుకోరుకుంటాడు.కానీ ప్రేక్షకుల తీర్పు ఇక్కడ ఇంపార్టెంట్.ఇన్ని సినిమాలతో ఈ ఫీట్ సాధించలేకపోయిన తమన్నా ఫైనల్ గా డెవిల్ మూవీ డ్యూయల్ మూవీ రిలీజ్ ముచ్చట తీర్చుకుంటుంది.