విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఆదాశ‌ర్మ `?` (క్వ‌శ్చ‌న్ మార్క్)

0
405
Adah Sharma question mark telugu movie release date confirmed

Adah Sharma question mark telugu movie: క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం` ?` క్వ‌శ్చ‌న్ మార్క్. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ మెయిన్ లీడ్ లో న‌టించింది. సంజ‌య్, అభ‌య్, భానుశ్రీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇటీవ‌ల మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో ఈ చిత్రంలోని పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Adah Sharma question mark telugu movie release date confirmed

ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్ గా నిర్మిస్తున్న క్వ‌శ్చ‌న్ మార్క్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇటీవ‌ల త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేసిన పోస్టర్ కు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ కరోనా సమయం లో అన్ని జాగ్రత్తలు తీసుకుని మా టీమ్ పూర్తి సహకారం ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేయ‌గ‌లిగాం. టైటిల్ కు, పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. షూటింగ్ మొత్తం హైదరాబాద్ మరియు మహారాజపురం అడవుల్లో చేసాము. అతి త్వ‌ర‌లో మా చిత్రంలోని పాట‌ను రిలీజ్ చేసి సినిమాను కూడా త్వ‌ర‌లోనే థియేట‌ర్స్ లో అయినా ఓటీటీ లో అయినా రిలీజ్ చేయ‌డానికి సిధ్దం అవుతున్నాం“ అన్నారు.

దర్శకుడు విప్రా మాట్లాడుతూ ..“మా నిర్మాత గౌరీ కృష్ణ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ “ఇది మంచి హారర్ సినిమా. చాలా బాగా వచ్చింది, నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పాను. ఈ చిత్రానికి క్వశ్చన్ మార్క్ (?) టైటిల్ పర్ఫెక్ట్. క్వశ్చన్ మార్క్ (?) ఏంటి దాని వెనుక కథ ఏంటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నాకు ఇంత మంచి సినిమా లో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విప్రా మరియు నిర్మాత గౌరీ కృష్ణ కి ధన్యవాదాలు” అని తెలిపారు.

బ్యానర్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
టైటిల్ : క్వశ్చన్ మార్క్ (?)
హీరోయిన్ః ఆదాశ‌ర్మ
కెమెరా : వంశీ ప్రకాష్
ఎడిటర్ : ఉద్ధవ్
సంగీత దర్శకుడు : రఘు కుంచె
ఆర్ట్ డైరెక్టర్ : ఉప్పెందర్ రెడ్డి
పి ఆర్ ఓ : వంగల కుమారా స్వామి
నిర్మాత : గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శక

Previous articleRaveena Tandon First Look Poster From KGF Chapter 2 as birthday gift
Next articleరేణు దేశాయ్ ‘ఆద్య’ ఆరంభం!!