Homeసినిమా వార్తలుపంజా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా విడుదల తేది ఫిక్స్.!!

పంజా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా విడుదల తేది ఫిక్స్.!!

Panja Vaishnav Tej, Srileela's movie Adikesava, Adikesava release date confirmed, Adikesava telugu movie all set to release on August 18th. Adikesava Trailer Release date.

Adikesava Release Date: యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishanav Tej), రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) తొలిసారి జతకట్టారు. ఇప్పుడు వారు ‘ఆదికేశవ’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా ప్రేమికులను అలరించేలా ఆయన చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Adikesava Relase Date: ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఆదికేశవ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Adikesava telugu movie all set to release on August 18th
Adikesava telugu movie all set to release on August 18th

అత్యంత ప్రతిభావంతుడు, జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ కలిసి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు.

Panja Vaishnav Tej, Sreeleela’s movie Adikesava, Adikesava release date confirmed, Adikesava telugu movie all set to release on August 18th. Adikesava Trailer Release date.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY