Adipurush Day 1 Collection: సినిమా సక్సెస్ అవ్వాలి అలాగే ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటాలి అంటే భారీగా ప్రమోషన్స్ చేయాల్సిన స్థితి నెలకొని ఉంది. కానీ ఏటువంటి హడావిడి లేకపోయినా..విడుదలై ఒక రోజు అయినా అప్పుడే అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది ‘ఆదిపురుష్’ మూవీ. డార్లింగ్ ప్రభాస్ రాముడు గా నటించిన ఈ సినిమాను ఓం రౌత్ అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించారు.
Adipurush Day 1 Collection: ఒక రోజుకే ఎవరూ ఊహించని రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా వసూలు రాబడుతు దూసుకు వెళ్తోంది. విజువల్ మరియు టెక్నికల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రంకు ఇది తెలుగు రాష్ట్రాలలో నాలుగు గంటల నుంచి షోలు మొదలు పెడుతున్నారు. అక్కడక్కడ మిశ్రమ ఫలితాలు అన్న టాక్ వినిపిస్తున్నప్పటికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో భారీగా రికార్డ్ స్థాయిలో బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
మొదటి రోజు ఏకంగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో రూ. 32.84 కోట్లు షేర్ మరియు రూ. 50.90 కోట్లు గ్రాస్ వసూళ్లు ఈ చిత్రం రాబట్టుకుంది. దీంతో మొదటి రోజే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆరో స్థానాన్ని సంపాదించుకుంది ఆది పురుష్. మొదటిరోజు మిగిలిన భాషలు మరియు ప్రాంతాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా 35 కోట్ల వరకు గ్రాస్ వసూలు అయింది.

అంటే ఇండియా వైడ్ తీసుకుంటే ఈ మూవీ 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా ఓవర్సీస్ లో ప్రీమియం షో లతో కలుపుకొని 1.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే యూఎస్‌లో ఈ సినిమా కు అచ్చంగా 12.50 కోట్లు వసూలు దక్కాయి అన్నమాట. మిగిలిన దేశాలలో ఓ 10 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. అంటే లెక్కలన్నీ కలిపితే ఆది పురుష ఫస్ట్ డే కలెక్షన్స్ సుమారు రూ. 105 కోట్లు వరకు అని చెప్పవచ్చు. ఇక వీకెండ్ కావడంతో రాబోయే రెండు రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్స్ అత్యంత భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది.
Web Title: Adipurush Day 1 Collection worldwide, Prabhas, Kriti Sanon, Adipurush 1st day box office collection, Adipurush worldwide gross, Adipurush telugu states share Adipurush today collection report